: "నాలో ఊపిరి ఉన్నన్నాళ్లూ ఉండవు మీకు కన్నీళ్లు"


కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ‘ప్రమాణం’ స్వీకరించారు. "నేను ప్రధాని అయ్యాక నా కోసం ఏమీ చేసుకోను. దురుద్దేశంతో ఏ పనీ చేయను. కష్టపడి పనిచేయడానికి వెనుకాడను" అంటూ మోడీ ప్రతిజ్ఞ చేశారు. న్యూఢిల్లీలో పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక రాజస్థాన్, హర్యానాల్లో జరిగిన సభల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుటుంబంపై మోడీ దాడి తీవ్రత పెంచారు. "రాజస్థాన్ లో సోలార్ పవర్ పేరిట అప్పటి సీఎం అశోక్ గెహ్లాట్ రైతుల భూమి సేకరించి, దానిపై అల్లుడికి బహుమతి (సోనియా అల్లుడు వాద్రా) ఇచ్చారు" అని ఆయన ఎద్దేవా చేశారు.

"హర్యానాలో తండ్రీ కొడుకులు (భూపేందర్ సింగ్ హూడా-దీపీందర్) వ్యాపారాలు చేసుకుంటుంటే, ఢిల్లీలో తల్లీకొడుకులు (సోనియా-రాహుల్) అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు అల్లుడూ రంగంలోకి వచ్చారు" అని ఆయన నిప్పులు చెరిగారు. ఇక "రాహుల్ ఒక్క పైసా తీయకుండా మూడు నెలల్లో రూ. 50 కోట్లు సంపాదించేలా హర్యానాలో భూ విధానం ఉంది" అని మోడీ విమర్శల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా, సోమవారం జరగాల్సిన మోడీ 3డీ ప్రచార సభ సాంకేతిక కారణాలతో 11వ తేదీకి వాయిదా పడింది. ఈ ప్రక్రియ ద్వారా ఒక చోట ప్రసంగిస్తూ, 100కు పైగా ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసే వీలుంటుంది.

  • Loading...

More Telugu News