: 'నిన్నే పెళ్లాడుతా' అంటూ ధర్నాకు దిగిన ప్రియుడు
సాధారణంగా ప్రియుడి ఇంటి ముందు పెళ్లి చేసుకోమని ప్రియురాలు గొడవ చేయడం, మౌనపోరాటం చేయడం మామూలే. అయితే ఆదిలాబాద్ జిల్లాలో సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ పెళ్లి చేసుకోమంటూ ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు గొడవకు దిగాడు.
మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్ లో యువతీ యువకులు ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించింది. దాంతో ఆ ప్రేమికుడు ప్రియురాలి ఇంటి ఎదుట ఆందోళన చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మిత్రులతో కలిసి గొడవకు దిగాడు. కొసమెరుపేమిటంటే, సదరు యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పంపారు.