: ఫైబర్ ఫుడ్ తీసుకోండి ... నిశ్చింతగా వుండండి!


మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ (పీచు) అధికంగా ఉంటుందా? అయితే, పక్షవాతం విషయంలో మీరు నిశ్చింతగా ఉండచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. పీచు సమృద్ధిగా వుండే ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయంటూ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్న విషయం మనకు తెలిసిందే. జీర్ణశక్తి మెరుగవడంతో బాటు, జీర్ణాశయ కేన్సర్ ముప్పు కూడా తప్పుతుందని ఇంతకు ముందే పరిశోధనల్లో తేలింది.

పీచు సమృద్ధిగా వుండే పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల పక్షవాతం వచ్చే ముప్పు కూడా గణనీయంగా తగ్గిపోతుందని లండన్ లోని లీడ్స్ విశ్వ విద్యాలయం జరిపిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. అంతేకాదు, పీచు పదార్ధాలు అధికంగా తీసుకోవడం వల్ల స్థూలకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి కూడా గట్టెక్కచ్చని ఈ పరిశోధనలో తేలింది. కాబట్టి, మీ ఆహారంలో పీచు పదార్ధాలకు ప్రాధాన్యత ఇవ్వండి!          

  • Loading...

More Telugu News