: గుంటూరులో హోరెత్తిన గల్లావారి ప్రచారం
గుంటూరు తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ విజయంకోసం ఆయన భార్య గల్లా పద్మ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో రోజుకొక ప్రాంతంలో ఆమె పర్యటిస్తున్నారు. ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వసంతరాయపురం, సంజీవయ్య నగర్ లో స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేశారు. భర్త జయదేవ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గల్లా పద్మ సినీ నటుడు కృష్ణ కుమార్తె కావడంతో స్ధానికులు ఆమెతో మాట్లాడేందుకు, ఆమెను చూసేందుకు ఆసక్తి కనబర్చారు.