: విజయవాడలో వైభవోపేతంగా సీతారాముల కల్యాణం
విజయవాడ నగరంలో శ్రీరామనవమి వేడుకలు కన్నులపండువగా సాగాయి. బీసెంట్ రోడ్డులోని రామాలయంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ జగత్ కల్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై సీతారాములను దర్శించుకున్నారు.