: ట్విట్టర్, ఫేస్ బుక్ తో బంధాలకు బీటలు తప్పవు
ట్విట్లర్, ఫేస్ బుక్ అకౌంట్ లు ఉన్నాయా? మీరు వివాహితులా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఫేస్ బుక్, ట్విట్టర్ కారణంగా బంధాలు బీటలు వారుతాయని, సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ట్విట్టర్, పేస్ బుక్ లు వ్యక్తిగత జీవితాల్లో పెను సంచలనాలకు కేంద్రబిందువులుగా మారుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వ్యసనంగా మారిన వారిపై ముస్సోరి స్కూల్ ఆఫ్ జర్నలిజానికి చెందిన ఓ విద్యార్థి అన్ని వయసులకు చెందిన 581 మంది ఖాతాదారులపై అధ్యయనం చేశాడు. ఎప్పడు ట్విట్టర్ లో లాగిన్ అవుతారు, ట్వీట్ చేయడం, వార్తలు చూడడం, ఇతరులకు సందేశాలు నేరుగా పంపడం, ఫాలోయర్స్ కు సమాధానాలు పంపడం వంటి విషయాలపై ఆరా తీశాడు.
దీని వల్ల ప్రేమికులు, భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతాయా అనే కోణంలో ఆరాతీశాడు. ట్విట్టర్, ఫేస్ బుక్ వాడడం వల్ల జంటల మధ్య సమస్యలు వస్తుంటాయని, ఒకర్నొకరు మోసం చేసుకోవడం దగ్గర్నుంచి మొదలై భౌతికంగా దాడులు చేసుకోవడం వరకు ఈ సమస్యలు దారితీస్తాయని తన అధ్యయనంలో తేలిందని అయన చెప్పాడు. భౌతిక దాడుల తరువాత విడాకులు తీసుకునే అవకాశం కూడా ఉందని అతను స్పష్టం చేశాడు. కనుక ట్విట్టర్, ఫేస్ బుక్ ఫాలోయర్స్ కాస్త జాగ్రత్తగా ఉండండి మరి.