: సోనియా అనుమతి తీసుకుని 150వ సినిమాలో నటిస్తా: చిరంజీవి


మంచి కథ దొరికితే సినిమాలలో నటిస్తానంటూ గత కొన్నేళ్లుగా చెబుతున్న చిరంజీవి మళ్ళీ అదే మాటను తాజాగా చెప్పారు. చక్కని సందేశంతో కూడిన సామాజిక విలువలున్న కథ దొరికితే మళ్ళీ ముఖానికి రంగేసుకోవడానికి తాను సిద్ధమని అయన పునరుద్ఘాటించారు. అలాంటి కథ దొరికిన మరుక్షణం తన 150వ చిత్రం ప్రారంభమవుతుందని చిరంజీవి అన్నారు. అందుకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనుమతి తీసుకుంటానని ఆయన చెప్పారు.

నిన్న సాయంకాలం బెంగళూరు నగర శివారులోని కేంబ్రిడ్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన 'చిగురు 2013' సాంస్కృతిక ఉత్సవాలలో చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తన 150వ సినిమా గురించి ఆయన ఆ విధంగా వివరించారు. బెంగళూరు నగరమంటే తనకు ఎంతో ఇష్టమనీ, షూటింగుల కోసం ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చాననీ, అయితే కేంద్రమంత్రిగా రావడం మాత్రం ఇదే తొలిసారనీ చిరంజీవి తెలిపారు.     

  • Loading...

More Telugu News