: రిజర్వేషన్లు కుదిస్తే పరిణామాలు తీవ్రం: ఆర్.కృష్ణయ్య
రిజర్వేషన్లు తగ్గిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనిచ్చే ప్రసక్తే లేదని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతం వున్నా 34 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం 23 శాతానికి కుదించాలనుకోవడం అగ్రవర్ణాల కుట్రలో ఓ భాగమేనని ఆయన ఆరోపించారు.
నల్గొండ జిల్లా భువనగిరిలో మీడియాతో మాట్లాడిన కృష్ణయ్య, దీనికి సంబంధించి మంత్రి జానా సరిగా దృష్టి పెట్టకపోవడంవల్లే గతంలో హైకోర్టులో కేసు ఓడిపోయామన్నారు. ఏదేమైనా, రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహిస్తే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కృష్ణయ్య హెచ్చరించారు.