: 30 సెకండ్లలోనే మొబైల్ చార్జింగ్
మొబైల్ చార్జింగ్ కనీసం రెండు గంటలైనా పెట్టాల్సిందే అప్పుడే ఫుల్. ఇది ప్రస్తుత స్థితి. అలా చార్జింగ్ పెట్టి... ఒక్కసారి కళ్లు మూసుకుని తెరిస్తే చాలు చార్జింగ్ ఫుల్. ఇది భవిష్యత్ లో సాకారం కాబోతోంది. చార్జింగ్ కోసం గంటల తరబడి కాలహరణాన్ని తప్పిస్తూ... కేవలం 30 సెకండ్లలోనే చార్జింగ్ పూర్తయ్యే ప్రొటోటైప్ చార్జర్ ను ఇజ్రాయెల్ కు చెందిన స్టోర్ డాట్ అనే కంపెనీ రూపొందించింది. స్టోర్ డాట్ ఇప్పటికే శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 4 కోసం ప్రొటోటైప్ చార్జర్ ను రూపొందించింది. ఇలాంటి చార్జర్లనే మిగతా స్మార్ట్ ఫోన్ల కోసం కూడా రూపొందించే యోచనలో ఉంది. సాధారణ చార్జర్ కంటే ఇది కొంచెం ధర ఎక్కువగా ఉంటుంది. 2016 నాటికి అందుబాటులోకి రానున్న ఈ చార్జర్ ధర 30 డాలర్ల(రూ.1800) వరకూ ఉండవచ్చని అంచనా.