: హైదరాబాదు ఇఎస్ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
హైదరాబాదు ఎర్రగడ్డ సమీపంలోని ఇఎస్ఐ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. ఉన్నట్టుండి మంటలు ఎగసిపడటంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే తేరుకున్న రోగుల బంధువులు ఆసుపత్రి భవనం బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.