: దొరల పెత్తనానికి నిరసనగానే టీఆర్ఎస్ లో చేరా: నోముల నర్సింహయ్య
నల్గొండలో దొరల పెత్తనానికి నిరసనగానే టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు సీపీఎం మాజీ నేత నోముల నర్సింహయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సీపీఎంలో ఉంటూనే తాను తెలంగాణ కోసం పోరాటం చేశానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ద్రోహం చేశాయంటూ నోముల మండిపడ్డారు.