: వైభవంగా సీతారాముల కల్యాణం
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు సీతమ్మవారికి మాంగల్యధారణ గావించారు. అనంతరం సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు తిలకిస్తున్నారు. భక్తులతో భద్రాద్రి జనసంద్రంగా మారింది.