: దేశవ్యాప్తంగా వైభవోపేతంగా సీతారామ కల్యాణ వేడుకలు
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలు సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు దేశప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.