: నిలకడగా 'నల్ల సూరీడు' ఆరోగ్యం
దక్షిణాఫ్రికా నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని దక్షిణాఫ్రికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మండేలా నిన్న వ్యాధి తిరగబెట్టడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా కార్యాలయం పేర్కొంది. ఈ ఉదయం మండేలా అల్పాహారం తీసుకున్నట్టు అధ్యక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి.