: భద్రాద్రిలో సీతారాముల కల్యాణం.. భక్తుల సందడి
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మిథిలా కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరుగుతోంది. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు.