: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుకుదురులో ఈ విషాద ఘటన జరిగింది. ఇవాళ పలువురు విద్యార్థులు ఈత కొట్టేందుకు కెఎంజి కాలువ వద్దకు వెళ్లారు. అందరూ ఈతకొట్టేందుకు కాలువలో దిగారు. అయితే, వారిలో ముగ్గురు నీటిలో మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆరుగురు విద్యార్థులు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరణించిన వారు కాకినాడ జైరామారావుపేటకు చెందిన వారుగా గుర్తించారు.