: రాజా, చిదంబరం ప్రత్యర్థుల నామినేషన్ల తిరస్కరణ


టెలికాం శాఖ మాజీ మంత్రి రాజా, కేంద్ర మంత్రి చిదంబరంపై పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తమిళనాడులోని నీలగిరి(ఎస్సీ) నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ గురుమూర్తి నామినేషన్ పత్రంతో పాటు బీఫాం నిర్ణీత సమయానికి సమర్పించకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ ను తిరస్కరించారు.

అయితే అప్పీలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ఆయనకు సూచించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున బరిలోకి దిగిన రాణి 1986లో జారీ అయిన కులధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో తాజా పత్రం తీసుకురావాలంటూ ఆమె నామినేషన్ కూడా పెండింగ్ లో ఉంచారు.

కాగా కేంద్ర మంత్రి చిదరంబరం ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న పీఎంకే అభ్యర్థి మణిరత్నం తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే పది మంది సంతకాలు జతచేయకపోవడంతో అతని నామినేషన్ పత్రాలు తిరస్కరించారు. అయితే ఆయనకు డమ్మీగా నామినేషన్ వేసిన ఆయన భార్య సుధ నామినేషన్ పత్రాలు సరిగ్గానే ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News