: 4.85 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా డబ్బు, మద్యం భారీ ఎత్తున పట్టుబడుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు 4.85 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అంతేకాకుండా, ఈ తనిఖీల్లో భాగంగా 1.01 కోట్ల రూపాయల నగదు, 2.80 కోట్ల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు, 2.40 కోట్ల విలువైన మత్తుపదార్థాలు, 37 లక్షల రూపాయల విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.