: మే 7 తరువాతే మున్సిపల్ ఫలితాలు విడుదల చేయండి: సుప్రీంకోర్టు


రాజకీయ పార్టీల ఆశలు అడియాసలయ్యాయి. ఏప్రిల్ లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడితే, వాటి ఆధారంగా సార్వత్రిక ఎన్నికలకు కార్యాచరణ రూపొందించుకోవచ్చనే పార్టీల ఆలోచనలకు సుప్రీంకోర్టు గండికొట్టింది. మే 7 తరువాతే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది. సాంకేతిక కారణాలను సాకుగా చూపి ముందుగా ఫలితాలను విడుదల చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కోర్టు అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News