: నాకు అవకాశమిస్తే అద్భుతంగా అభివృద్ధి చేస్తా: కేసీఆర్
అవకాశమిస్తే తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పలు కార్మిక సంఘాలు ఈరోజు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే మంచి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు. తెలంగాణలో మంచి వనరులున్నాయని, చిత్తశుద్ధితో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని ఆయన అన్నారు. ఇదంతా మంచి ప్రభుత్వం వచ్చినప్పుడే సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయ అవినీతిని అంతం చేయాలని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.