: భారత సంతతి బౌలర్ కు స్టీవ్ వా మెడల్
ఆస్ట్రేలియాలో భారత సంతతి ఫాస్ట్ బౌలర్ గురిందర్ సంధూ చరిత్ర సృష్టించాడు. స్టీవ్ వా మెడల్ అందుకున్న తొలి భారత సంతతి బౌలర్ గా ఘనత వహించాడు. గురిందర్ గత ఏడాది జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో ఆసీస్ జట్టు ఫైనల్ మెట్టుకు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేగాకుండా, ఇటీవలే ఆసీస్ దేశవాళీ క్రికెట్లో కాలుమోపి సంచలనాలు నమోదు చేశాడు.
రయోబి కప్ పోటీల్లో 4 మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' గానూ నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా ప్రధాన దేశవాళీ టోర్నీ అయిన షెఫీల్డ్ షీల్డ్ లో న్యూ సౌత్ వేల్స్ జట్టుకు ఆడుతూ కేవలం రెండు మ్యాచ్ ల్లో 14 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడీ ఆజానుబాహుడు.