: ఈ జబర్దస్త్ పొత్తుల మతలబేంది?: కేసీఆర్
ఈ జబర్దస్త్ పొత్తుల మతలబేందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఎలా కుదిరిందని నిలదీశారు. పోలవరం డిజైన్ మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలు పచ్చబడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు మేలు జరగాలంటే మంచి ప్రభుత్వం ఏర్పడాలని ఆయన తెలిపారు.