: అభివృద్ధి జగన్ వల్లే సాధ్యం: దినేష్ రెడ్డి
ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే వైఎస్సార్సీపీలో చేరానని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలను తాను ప్రత్యక్షంగా చూశానని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జగన్ కు మాత్రమే సాధ్యమని చెప్పారు. పార్టీ తనను ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జగన్ పై కావాలనే తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు.