: తెలుగు దేశం తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల పేర్ల జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విడుదల చేశారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో మాట్లాడుతూ, 9వ తేదీన తెలంగాణలో నామినేషన్లకు చివరి రోజు కావడంతో నేడు జాబితా విడుదల చేశామని తెలిపారు. ఎల్లుండి సీమాంధ్ర ప్రాంతం అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
అభ్యర్థుల ఎంపికలో శాస్త్రీయమైన పద్దతులు అవలంభించామని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఆయాప్రాంతాల్లోని కార్యకర్తల అభిప్రాయాలు, సెల్ ఫోన్ లో నివేదికలు తీసుకున్నామని అన్నారు. స్థానికంగా సమాచారం సేకరించిన తరువాతే అభ్యర్థులను ఎంపిక చేశామని ఆయన తెలిపారు.