: బంగారం అక్రమ రవాణా వెనుక చైనా హస్తముందా?


ప్రతి రోజూ సాగుతోన్న కిలోల కొద్దీ బంగారం అక్రమ రవాణా వెనుక చైనా మాఫియా ఉందా? అంటే, అవుననే అంటున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ కేంద్రంగా ఈ స్మగ్లింగ్ కొనసాగుతున్నట్లు వారు చెబుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ నిందితుడు జిలానీని ప్రశ్నించిన అధికారులు చైనాతో ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి లింక్ ఉన్నట్లు చెప్పారు. బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి చైనా మాఫియా భారత్ కు బంగారాన్ని తరలిస్తోందని, మాఫియా లీడర్లు మహ్మద్, రాజూభాయ్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారనీ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతోందని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News