: ఎక్స్ రే చూసి భూమిలో వజ్రాలున్నాయో? లేదో? చెప్పేయవచ్చు
భూమిలో ఎక్కడ వజ్రాలున్నాయో ఎలా తెలుస్తుంది? డ్రిల్ చేసి అన్వేషణ సాగిస్తేగానీ తెలియదు. కానీ అంత శ్రమ, సమయం అవసరం లేకుండా సులభంగా వజ్రాల గుట్టును విప్పే ఎక్స్ రే టెక్నిక్ ను జర్మనీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎక్కడైతే అన్వేషణ అవసరం ఉందో ఆ ప్రదేశాన్ని ఎక్స్ రే చిత్రాలు తీయడం... వజ్రాలున్నాయో లేదో తెలుసుకోవడమే దీని ప్రత్యేకత.