: జగన్ సమైక్యాన్ని సోనియాకు తాకట్టు పెట్టారు: యనమల
బీజేపీ, టీడీపీ పొత్తుని విభజన పొత్తుగా వైఎస్సార్సీపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్ర విభజన చేయమని చెప్పింది వైఎస్సార్సీపీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. జైలు నుంచి బయటకు రావడానికి జగన్ సమైక్యవాదాన్ని సోనియాగాంధీకి తాకట్టు పెట్టడం నిజం కాదా? అని యనమల నిలదీశారు.
బీజేపీ-టీడీపీ పొత్తు రాష్ట్రంలో రాజకీయ సునామీ సృష్టిస్తుందని, ఇందులో కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని యనమల అన్నారు. సెక్యులరిజం ముసుగులో ప్రజలను మళ్లీ మోసం చేయాలని తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లు చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీడీపీ, బీజేపీల ఉమ్మడి అజెండా అభివృద్ధి, పారదర్శక పాలన అని ఆయన చెప్పారు. మచ్చలేని నాయకత్వాన్ని అందించేది నరేంద్ర మోడీ, చంద్రబాబు అని ప్రజలు నమ్ముతున్నారని యనమల తెలిపారు.