: అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తాం: జేపీ


అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తామని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జేపీ ఈరోజు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లోక్ సత్తా అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించిందన్నారు. అవినీతిని రూపుమాపాలనుకునే వారికి లోక్ సత్తా ఆహ్వానం పలుకుతుందని ఆయన చెప్పారు. ఈ రోడ్ షోలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లోక్ సత్తా నేతలు కఠారి శ్రీనివాసరావు, హేమ తదితరులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News