: కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
బాలలూ... కంప్యూటర్లు, టీవీల ముందు గంటల తరబడి తిష్ట వేస్తున్నారా? అలా అయితే మీ ఎముకలు గుల్ల బారినట్లే! ఎక్కువ సమయం పాటు అలా కూర్చున్న వారిలో ఎముకలు బలహీన పడి ఆస్టియో పొరోసిస్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని అర్కిటిక్ వర్సిటీ ఆఫ్ నార్వే శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా టీనేజీలో ఉన్నవారు ఇలా కూర్చోవడం వల్ల బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ) సమస్య బారిన పడే అవకాశం ఉందంటున్నారు. చలనం లేని జీవన విధానం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడడంతోపాటు ఒబెసిటీ సమస్య కూడా రావచ్చని వీరు హెచ్చరిస్తున్నారు.