: యూపీఏ సర్కారు రాజీనామా చేయాల్సిందే : తృణమూల్ డిమాండ్
యూపీఏ సర్కారు రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండు చేసింది. డీఎంకే మద్ధతు ఉపసంహరించుకోవడంతో యూపీఏ పూర్తిగా మైనారిటీలో పడిపోయిందని ఆ పార్టీ కార్యదర్శి ముకుల్ రాయ్ ఈరోజు కోల్ కతాలో అన్నారు. అందుకే వెంటనే రాజీనామా చేయాలని ఆయన పట్టుబట్టారు. ఒక్కక్షణం కూడాఅధికారంలో కొనసాగే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు.