: హీరో సంపూర్ణేష్ బాబుపై దాడి


'హృదయ కాలేయం' సినిమా హీరో సంపూర్ణేష్ బాబు, ఆ సినిమా దర్శకుడు స్టీవెన్ శంకర్ లపై దాడి జరిగింది. ఈ దాడిలో వీరికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. గాయపడిన వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. దాడికి సంబంధించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాదాపూర్ లోని ఓ హోటల్ కు వెళ్లి తిరిగివస్తుండగా వీరిపై దాడి జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత శుక్రవారం విడుదలైన 'హృదయ కాలేయం' సినిమా మంచి టాక్ సంపాదించుకుంది.

  • Loading...

More Telugu News