: లోక్ సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి
రేపు జరగనున్న లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అస్సాంలోని ఐదు స్థానాలతో పాటు త్రిపురలోని పశ్చిమ త్రిపుర స్థానానికి రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ భారీ ఎత్తున పారామిలటరీ బలగాలను తొలిదశ పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు తరలించింది.