: ముగిసిన తొలిదశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
రాష్ట్రంలో తొలిదశ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎండలు మండుతున్నా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మంథనిలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరిగింది. బ్యాలెట్ పద్దతిలో ఈ ఎన్నికలు జరిగాయి. 557 జడ్పీటీసీ, 8250 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉండి ఇంకా ఓటు వేయని వారికి మాత్రం... ఎంత సమయమైనా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తారు.