: టీ20 మహిళల వరల్డ్ కప్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియా


బంగ్లాదేశ్ లో జరిగిన టీ20 మహిళల ప్రపంచ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఢాకాలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ ను 6 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. అనంతరం తమ బ్యాట్స్ ఉమన్ చెలరేగడంతో ఆస్ట్రేలియా కేవలం 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకోవడం ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ఇది వరుసగా మూడోసారి (హ్యాట్రిక్).

  • Loading...

More Telugu News