: టాప్ టెన్ లో కోహ్లీ, రైనా
టీ20 ర్యాంకుల్లో భారత బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా టాప్ టెన్ కు ఎగబాకారు. ఐసీసీ ఈరోజు ప్రకటించిన టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో డైనమిక్ ఆటగాడు కోహ్లీ 731 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇక, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ రైనా 719 పాయింట్లతో కోహ్లీ వెనకాలే తొమ్మిదోస్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ విధ్వంసక ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ 810 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, టీమ్ విభాగంలో భారత్ మూడో స్థానం పదిలపరుచుకుంది.