: ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి ఉంది: వెంకయ్యనాయుడు
రానున్న ఎన్నికల్లో బీజేపీ 250కి పైగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండానే ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా బీజేపీకి ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూడనుందని జోస్యం చెప్పారు. ఎన్డీఏ ప్రభంజనం ముందు యూపీఏ కొట్టుకుపోతుందని తెలిపారు. ఈ రోజు కోల్ కతాలో ఆయన మీడియాతో మాట్లాడారు.