: టీడీపీ, బీజేపీలది అపవిత్ర కలయిక: సి.రామచంద్రయ్య
టీడీపీ, బీజేపీల పొత్తుపై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. ఈ రెండు పార్టీల పొత్తు ఓ అపవిత్ర కలయిక అంటూ విమర్శించారు. మతతత్వవాది అయిన మోడీ ఫొటోను పెట్టుకుని చంద్రబాబు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఏమి ఆశించి ఈ రెండు పార్టీలు కలిశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన ఎంపీలందరూ మళ్లీ సొంత గూటికి రావాలని కోరారు.