: కాంగ్రెస్ లోక్ సభ జాబితాలో ఒక్క మహిళ కూడా లేకపోవడంపై రేణుక అభ్యంతరం
తెలంగాణ లోక్ సభ స్థానాలకు ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో ఒక్క మహిళకు కూడా స్థానం దక్కకపోవడంపై రేణుకా చౌదరి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ పెద్దలను కలిశారు. మహిళల రిజర్వేషన్ల కోసం పాటుపడతామని చెబుతూ, మహిళలకు సీట్లను కేటాయించకపోతే... ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వారికి రేణుక సూచించారు.