: చిరంజీవి తనకు తానే అమ్ముడుపోయారు : మెట్ల
కేంద్రమంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టింది కేవలం సంపాదన కోసమేనని మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ విమర్శించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చిరంజీవి సీట్లు అమ్ముకోవడమే గాక, అనంతరం కాంగ్రెస్ లో కలిసి తనకు తానే అమ్ముడుపోయారని ఎద్దేవా చేశారు. అప్పట్లో పీఆర్పీకి రాజీనామా చేసి సొంతగూడైన టీడీపీకి చేరిన మెట్ల ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.