: ఎన్నికల అనంతరం టీడీపీ కనుమరుగు: అసదుద్దీన్
టీడీపీ, బీజేపీ పొత్తు ఖరారవడంతో ఒకప్పుడు టీడీపీ మిత్రపక్షం, ప్రస్తుతం వైరి పక్షమైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. టీడీపీ మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతోందని, ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. ఒక అడుగు ముందుకేసి ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు.