: లాభాపేక్షతోనే ప్రభుత్వానికి పార్టీల మద్ధతు: వెంకయ్యనాయుడు


లాభాపేక్షతోనే అవిశ్వాస తీర్మానాన్ని దేశంలో పార్టీలన్నీ ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభలో అవిశ్వాసం పెట్టినప్పుడు, ఆ సమయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలన్నీ ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాయని ఆరోపించారు. అందువల్లే సర్కారు కూడా నిలబడుతోందన్నారు.

న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన వెంకయ్యనాయుడు.. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. యూపీఏకు
 మద్దతు ఉపసంహరించుకోమని ప్రకటించిన ఆయనకు మాట మార్చడం అలవాటేనన్నారు.  సీబీఐ భయంతోనే ఒక్కరోజులో నిర్ణయాన్ని మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News