: సీట్ల సంఖ్య ఖరారు... ఏయే స్థానాలో వెల్లడిస్తాం: చంద్రబాబు
టీడీపీ, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు ఫైనలైజ్ అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. సీమాంధ్రలో బీజేపీకి 5 లోక్ సభ, 15 అసెంబ్లీ సీట్లు... తెలంగాణలో 8 లోక్ సభ 47 అసెంబ్లీ సీట్లను కేటాయించామని వెల్లడించారు. అయితే ఏయే స్థానాలను కేటాయించామన్న విషయాన్ని రెండుమూడు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు.