: నిజాంపై బాంబు దాడి చేసిన రావుల జగదీష్ ఆర్య(96) కన్నుమూత


నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయనపై బాంబు దాడి చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు రావుల జగదీష్ ఆర్య (96) కన్నుమూశారు. నారాయణరావు పవార్, గండయ్య గుప్తలతో కలసి ఆయన బాంబు దాడిలో పాల్గొన్నారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న(శనివారం) ఉదయం 9 గంటలకు రామంతాపూర్ లోని తన కుమారుడి నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆర్య భౌతికకాయాన్ని బడీచౌడిలోని హెల్త్ లీగ్ ప్రాంతంలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించారు. ఈ రోజు అంబర్ పేట్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. తెలంగాణ విమోచన కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినవారిలో జగదీష్ ఆర్య కీలక పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News