: జైపూర్ భామకు మిస్ ఇండియా-2014 కిరీటం


ఫెమీనా మిస్ ఇండియా - 2014 కిరీటాన్ని జైపూర్ కు చెందిన కోయల్ రాణా సొంతం చేసుకుంది. ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్స్ లో కోయల్ విజేతగా నిలిచింది. 24 మంది పోటీ పడగా, తన అందచందాలు, తెలివితేటలతో కోయల్ ముందుంది. ముంబైకి చెందిన మల్హోత్రా, గోవా భామ గెయిల్ డిసిల్వ రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. న్యాయమూర్తుల ప్యానెల్ లో మలైకా అరోరా ఖాన్, అభయ్ డియోల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అదితి రావు తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News