: జగన్ ను కలసిన ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు


హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కలిశారు. వైకాపా మేనిఫెస్టోలో ఏపీఎన్జీవోల ప్రతిపాదనలను కూడా చేర్చాలని ఈ సందర్భంగా జగన్ ను అశోక్ బాబు కోరారు. సమైక్య ఉద్యమంలో ఎక్కువగా నష్టపోయింది ఉద్యోగులేనని... వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అశోక్ బాబు విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల సంక్షేమానికి వైకాపా కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలో అశోక్ బాబుతో పాటు పలువురు ఏపీఎన్జీవో నేతలు కూడా ఉన్నారు. సమావేశం అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ... మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలను ప్రతిపాదించడానికే వచ్చామని, సీట్ల కోసం మాత్రం కాదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News