: కిరణ్ లాంటి వ్యక్తి దేశ చరిత్రలోనే లేడు: రాంరెడ్డి దామోదర్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆకాశానికెత్తారు సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి. సీఎం నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ సూర్యాపేట లో నిర్వహించిన బహిరంగ సభలో రాంరెడ్డి ప్రసంగిస్తూ సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. 2014 ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని ఆయన జోస్యం చెప్పారు. కిరణ్ లాంటి వ్యక్తిని తాను దేశ చరిత్రలో చూడలేదన్నారు. ప్రాంతాలకతీతంగా కిరణ్ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారన్నారు.