: రేపు కడపలో టీడీపీ ప్రజాగర్జన సభ
తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభల్లో భాగంగా రేపు కడపలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట వరకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాయచోటి మీదుగా కడప చేరుకుంటారు. పట్టణంలో వివిధ ప్రాంతాల మీదుగా ర్యాలీగా వెళ్లి, మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం జిల్లా పార్టీ నేతలు, క్రియాశీల కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి కడపలోనే చంద్రబాబు బస చేస్తారు.