: నేడు జేఈఈ మెయిన్స్ పరీక్ష


దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్-2014 ఈ రోజు జరగనుంది. ఈ పరీక్ష రాసేందుకు దేశ వ్యాప్తంగా 13,56,805 మంది దరఖాస్తు చేయగా, రాష్ట్రం నుంచి 1,22,863 మంది దరఖాస్తు చేశారు. దేశ, విదేశాల్లో కలిపి మొత్తం 150 కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, తిరుపతి, గుంటూరు నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం జరిగే పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • Loading...

More Telugu News