: గోవాలో డ్రగ్ మాఫియా ఆట కట్టిస్తాం: ఎంపీ శ్రీపాద్ నాయక్


భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వస్తే గోవా తీరప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్ మాఫియా ఆట కట్టిస్తామని ఎంపీ శ్రీపాద్ నాయక్ చెప్పారు. నార్త్ గోవా నుంచి బీజేపీ తరపున మూడుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన నాయక్ నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం అంతుచూసేలా చేస్తామని ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News