: సొంతూరు, పొరుగూరు... ఏదైనా ఓకే!


సొంత నియోజకవర్గంలో గెలవడం కన్నా, పక్క నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేసి అక్కడ కూడా విజయం సాధించడం గొప్ప విషయమనే చెప్పచ్చు. అది కూడా ఒక్క నియోజక వర్గమే కాకుండా, రెండు మూడు నియోజక వర్గాలు మారి, గెలుపొందడం మరీ గొప్ప విషయం. మరి, అలాంటి ఫీట్లు సాధించిన నాయకులు తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, ఇద్దరు కాదు... ఏకంగా ఆరుగురు ఉన్నారు.

దివంగత మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు బూరుగుపూడి, కడియం, ముమ్మిడివరం... ఈ మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కో చోట రెండేసి సార్లు గెలిచారు. అంటే మొత్తం ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నమాట. ఇక పంతం పద్మనాభం పెద్దాపురం, జగ్గంపేట... ఈ రెండు చోట్ల నుంచి గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే కె.వీరన్న కోరుకొండ, బూరుగుపూడి రెండు చోట్లా గెలిచారు. నడింపల్లి రామభద్రరాజు చెయ్యేరు, అమలాపురం నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. గెడ్డం మహాలక్ష్మి, సయినాల గణేశ్వరరావు... వీరిద్దరూ రాజోలు, నగరం నియోజకవర్గాలు రెండింటిలోనూ జయకేతనం ఎగురవేశారు.

  • Loading...

More Telugu News